25 టన్నుల సబ్సిడీ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-12-15T07:03:13+05:30 IST

సబ్సిడీ(రేషన్‌) బియ్యంను అక్రమంగా తరలిస్తున్న వారిపై నాలుగో పట్టణ పోలీసులు కొరడా ఝుళిపించారు.

25 టన్నుల సబ్సిడీ బియ్యం పట్టివేత

- ముగ్గురు నిందితుల అరెస్ట్‌

అనంతపురం క్రైం, డిసెంబరు 14: సబ్సిడీ(రేషన్‌) బియ్యంను అక్రమంగా తరలిస్తున్న వారిపై నాలుగో పట్టణ పోలీసులు కొరడా ఝుళిపించారు. లారీతోపాటు రూ.6.5 లక్షలు విలువ చేసే 25 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లాలోని డోన్‌ రఫీ రైస్‌ మిల్లు నుంచి అక్కడ పనిచేస్తున్న ప్యాపిలికి చెందిన డ్రైవర్‌ ప్రసాద్‌, నంద్యా లకు చెందిన గుమాస్తా నిజాముద్దీన్‌, జిల్లాలోని యాడికికి చెందిన బెస్త మ ల్లికార్జున అనే గుమాస్తాలు కలిసి సోమవారం తెల్లవారుజామున లారీలో 25 టన్నుల పీడీఎస్‌ బియ్యం లోడ్‌ చేసుకుని అక్రమంగా కర్ణాటకకు బయల్దేరారు. నగర శివారులోని తపోవనం సర్కిల్‌ సమీపంలోకి రాగానే.. రాబడిన సమాచారంతో సీఐ కత్తి శ్రీనివాసులు, ఎస్‌ ఐ జమాల్‌బాషా తదితర సిబ్బందితో కలిసి లారీని పట్టుకున్నారు.  కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. రైస్‌మిల్లు యజమాని రఫీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-12-15T07:03:13+05:30 IST