మళ్లీ యూరియా అధిక విక్రయాలు!

ABN , First Publish Date - 2020-12-15T07:01:33+05:30 IST

జిల్లాలోని పలు మండలాల్లో కొందరు డీలర్లు మరోసారి యూరియా అధికంగా విక్రయించినట్టు నిర్ధారణ అయ్యింది.

మళ్లీ యూరియా అధిక విక్రయాలు!

ఐదు మండలాల్లో 20 మంది పేర్లపై 88 మెట్రిక్‌ టన్నుల అమ్మకం 

విచారించిన జేడీఏ 

ఏడుగురు డీలర్లకు షోకాజు నోటీసులకు సన్నద్ధం 

అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 14:  జిల్లాలోని పలు మండలాల్లో కొందరు డీలర్లు మరోసారి యూరియా అధికంగా విక్రయించినట్టు నిర్ధారణ అయ్యింది. గతనెలలో బొమ్మనహాళ్‌, గుంతకల్లు, కళ్యాణ దుర్గం, నార్పల, ఉరవకొండ మండలాల్లోని ఏడుగురు డీలర్లు 20 మంది పేర్లపై 88 మె ట్రిక్‌ టన్నుల యూరియాను విక్రయుంచినట్లు తేల్చారు. ప్ర భుత్వ నిబంధనల మేరకు రైతులతో ఈ-పోస్‌లో వేలి ముద్ర వేయించుకొని ఎరువులు విక్రయించాలి. ఆ డీలర్లు అందుకు విరుద్ధంగా వ్యవహరించినట్లు సమాచారం. అధిక యూరియా విక్రయాలపై సోమవారం జేడీఏ కార్యాలయంలో ఐదు మం డలాల వ్యవసాయ అధికారులు, సంబంధిత డీలర్లతో జేడీఏ రామకృష్ణ, ఏడీఏ పీపీ విద్యావతి విచారించారు. ఎక్కువ మో తాదులో యూరియా ఎందుకు విక్రయుంచారు..? తదితర అంశాలపై ఆరాతీశారు. జేసీ ఆదేశాల మేరకు ఏడుగురు డీ లర్లకు షోకాజు నోటీసులు జారీ చేయనున్నట్లు జేడీఏ కా ర్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. 


Updated Date - 2020-12-15T07:01:33+05:30 IST