-
-
Home » Andhra Pradesh » Srikakulam » atp ammavodi details
-
‘అమ్మఒడి’ పర్యవేక్షణ విభాగాల ఏర్పాటు
ABN , First Publish Date - 2020-12-15T07:02:21+05:30 IST
అమ్మఒడి పథకానికి సంబంధించిన సమస్యలు, వినుతుల పర్యవేక్షణకు డీఈఓ శామ్యూల్.. జిల్లా, డివిజన్ స్థాయిల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు.

అనంతపురం విద్య, డిసెంబరు 14: అమ్మఒడి పథకానికి సంబంధించిన సమస్యలు, వినుతుల పర్యవేక్షణకు డీఈఓ శామ్యూల్.. జిల్లా, డివిజన్ స్థాయిల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణ విభాగ సభ్యు లు ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల పిల్లలకు సంబంధించి వచ్చిన వినతులు, ఫిర్యాదులను పర్యవేక్షించి, సందేహాల నివృత్తితోపాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. జిల్లా విభాగంలో ఆదర్శ పాఠశాలల ఏడీ నాగరాజు (ఫోన్: 8328529896), ఏఎంఓ హరికృష్ణ (8008563078), ఏపీఓ నారాయణస్వామి(9100599979), పామిడి సీఆర్పీ సురేష్ (9885642045), కూడేరు సీఆర్సీ రమణ (9959673400) ఉన్నారు. డివిజన్ స్థాయి విభాగాల్లో అనంతపురానికి ఆనంద్‌బాబు (7013279159), ధర్మవరానికి షమీవుల్లా (9642056333), గుత్తికి ఆరీఫ్ (9493891786), పెనుకొండకు బాలాజీ (9493368723)ని నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.