-
-
Home » Andhra Pradesh » Srikakulam » Armored measures for corona cutting
-
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు
ABN , First Publish Date - 2020-03-25T10:58:27+05:30 IST
కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది.వైరస్ వ్యాప్తిచెందకుండా నిషేధాజ్ఞలు

(ఇచ్ఛాపురం/రూరల్/కవిటి/సోంపేట/రూరల్ ): కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది.వైరస్ వ్యాప్తిచెందకుండా నిషేధాజ్ఞలు విధించింది.ఈ ఆజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.అత్యవసర పరిస్థితి తప్పితే అనవరంగా రోడ్డుపైకి ఎవరు వచ్చినా కేసులు నమోదుచేస్తామని సీఐ వినోద్‌బాబు తెలిపారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులను పూర్తిగా మూసేశారు.
పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద ఒడిశా నుం చి వచ్చిన వాహనాలను వెనక్కు పంపించారు. ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో సాధారణ ఓపీలను తాత్కాలికంగా నిలిపివేశారు. కరోనాపై జనసేన నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు ఆధ్వర్యంలో అవగాహనకల్పించారు. డైలీమార్కెట్‌లో కూరగాయల అమ్మకాలు నిషేధిస్తున్నామని కమిషనర్ లాలం రామలక్ష్మి తెలిపారు.స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు అమ్మకాలు జరుగుతాయని చెప్పారు. కూరగాయలు ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా 144 సెక్షన్ అమలులో ఉండడంతో నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ కె.వాసునారాయణ హెచ్చరించారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ ఒక ప్రకటనలో కోరారు. సోంపేట పట్టణంలో రోడ్డుపైకి వచ్చిన ప్రజలను సీఐ సతీష్‌కుమార్, ఎస్‌ఐ కె.వెంక టేశ్ సిబ్బందితో కలిసి ఇళ్లకు పంపించారు. కాగాసోంపేటలోని 31మంది పేదలకు ఏడురోజులకు సరిపడ అటుకుళ్లు, బెల్లం, బ్రెడ్‌ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు సత్యసాయి సేవా సమితి దివ్యమందిరం సభ్యులు పంపిణీ చేశారు. కొర్లాంలో పారిశుధ్యపనులను చేపట్టారు.పలు గ్రామాల్లో బారువ ఎస్‌ఐ జి.నారాయణ స్వామి పర్యటించి బయట తిరగవద్దని హెచ్చరించారు.