వైసీపీ పాలనలో దళితులకు అన్యాయం
ABN , First Publish Date - 2020-05-24T08:47:07+05:30 IST
వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి గుండ అప్పల సూర్య నారాయణ ఆరోపించారు.

మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ
బలగ, మే 23 : వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి గుండ అప్పల సూర్య నారాయణ ఆరోపించారు. శనివారం శ్రీకాకుళంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటానికి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ విశాఖలో డాక్టర్ సుధాకర్‌పై దాడిఘటనలో న్యాయవ్యవస్థ చొరవ తీసుకుందని న్యాయం చేసిందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు ఎం.వెంకటేష్, మాదిగ రమణ, పీఎంజే బాబు, చిట్టి నాగభూషణం, ప్రధాన విజయరాము, అక్కి రాజారావు, సుశీల పాల్గొన్నారు.