క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2020-10-19T10:05:26+05:30 IST

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

రేగిడి:మండలంలో ఎట్టకేలకు క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాపై పోలీసులు ఉక్కుపా దం మోపారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లే మార్గంలో క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం అర్ధరాత్రి  ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ ఆలీ తన సిబ్బందితో కలసి దాడి చేశారు. ఇదే మండలం మంగళపేటకు చెందిన కొమిరి నీలకంఠం, ఉంగరాడమెట్టకు చెందిన  వ్యాపారులు వారణాసి బాలకృష్ణ, వేగిరెడ్డి సింహాచలం,లక్ష్మీపురానికి చెందిన పం డూరి కనకరాజు, కెంబూరు రమేష్‌లను పట్టుకొని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.31,400 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-10-19T10:05:26+05:30 IST