రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-21T04:39:11+05:30 IST

కేంద్రం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని సీపీఎం నాయకుడు డి.గోవిందరావు డిమాండ్‌ చేశారు. చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో చేపడుతున్న రైతు ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరులకు ఆదివారం నివాళి అర్పించారు.

రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
పాలకొండ: కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు


రాజాం, డిసెంబరు 20: కేంద్రం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని సీపీఎం నాయకుడు డి.గోవిందరావు డిమాండ్‌ చేశారు. చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో చేపడుతున్న రైతు ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరులకు ఆదివారం నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ఉద్య మంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు.  పార్లమెంట్‌లో ఎటువంటి చర్చ జరగకుండా అప్రజస్వామికంగా మూడు చట్టాలను తీసుకువచ్చి రైతులకు తీరని నష్టం చేసిందన్నారు. నల ్లచట్టాలను రద్దు చేయాలని చేస్తున్న ఉద్యమంలో 33 మంది రైతులు ప్రాణత్యాగం చేశారని, వాళ్ల త్యాగాలను గుర్చించి ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వామపక్ష నేతలు శ్రీనివాసరావు, రామ్మూర్తి నాయుడు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు


గుజరాతీపేట: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణ మని వామపక్ష నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరస నగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆదివారం స్థానిక క్రాంతి భవనం నుంచి రామలక్ష్మణ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ గడ్డపై అలుపెరుగని పోరాటం చేస్తూ ఇప్పటి వరకు దాదాపు 30 మంది రైతులు అశువులు బాసినా కేంద్రానికి చీమకుట్టినట్లయినా లేదని  విమర్శించారు.  కార్యక్రమంలో సనపల నర్సింహులు, తాండ్ర ప్రకాష్‌, టి.తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు. 

 

ఎచ్చెర్ల: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో చేపట్టిన పోరాటంలో అసువులు బాసిన రైతులకు ఆదివారం చిలకపాలెంలో నివాళి అర్పించారు. కార్యక్రమంలో  సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌.అమ్మన్నాయుడు, సీపీఎం నేత తోనంగి నందోడు తదితరులు పాల్గొన్నారు. 


పాలకొండ: పాలకొండ శిర్లిపోతున్నవీధి జంక్షన్‌ నుంచి ఆదివారం రాత్రి  ఏపీ ఆశ వర్కర్స్‌ యూనియన్‌, సీఐ టీయూ ఆధ్వర్యంలోకిసాన్‌ జ్యో తి కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.  కేంద్ర ప్రభు త్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సవరణ చట్టం 2020 రద్దు చేయాలని  డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసు కు వచ్చిన ప్రజా, రైతు, కార్మిక చట్టాలు కార్పొరేట్లకు లాభాలు చేకూరు స్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు బి.స్వప్న, కొల్లి గౌరీశ్వరి,  సూర్యకళ  పాల్గొన్నారు. 


 పాలకొండ రూరల్‌: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు బుడితి అప్పలనాయుడు, అభ్యుదయ రైతు కండాపు ప్రసాదరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం పాలకొండలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ అసువులు బాసిన 22 మంది అమరవీరులకు నివాళులర్పించారు.  కార్యక్రమంలో వండాన కూర్మారావు, సబ్బ నానాజీ, బెజ్జిపురం చిన్నంనాయుడు  పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-12-21T04:39:11+05:30 IST