అంగన్‌వాడీల అక్రమాలపై కొరడా

ABN , First Publish Date - 2020-12-03T06:18:29+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాలలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు.

అంగన్‌వాడీల అక్రమాలపై కొరడా

కళ్యాణదుర్గం వర్కర్‌ తొలగింపు

మరో ఇద్దరిపై వేటుకు సిద్ధం !

అనంతపురం వైద్యం, డిసెంబరు 2 : అంగన్‌వాడీ కేంద్రాలలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. పౌష్టికాహారం, పాలు, గుడ్లు పంపిణీలో పలు కేంద్రాలలో సక్రమంగా సరఫరా చేయడంలేదని, గడువు మించిన పాలు, కుళ్లిన కోడి గుడ్లు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల బలంగా రావటంతో జేసీ డాక్టర్‌ సిరి అక్రమార్కులపై కన్నెర్ర చేశారు. ఐదుగురు సీడీపీఓలకు వారం కిందట షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఆరోపణలు వచ్చిన మండలాలలో విచారణ చేయించి వాస్తవ నివేదికలు తెప్పించుకున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో సాయిబాబా గుడి వీధి కాలనీలో ఉన్న అంగన్‌వాడీ వర్కర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించి, గడువు దాటి న పాలను సరఫరా చేసినట్లు  విచారణ అధికారులు తే ల్చారు. ఆ నివేదికల ఆధారంగా ఆ కేంద్రంలో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మిదేవిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని బుధవారం ఇన్‌చార్జ్‌ పీడీ జేసీ డాక్టర్‌ సిరి కళ్యాణదుర్గం సీడీపీఓకు జారీ చేశారు. మరో ఇద్దరు అంగన్‌వాడీ వర్కర్లపైనా వేటుకు సి ద్ధం చేసినట్లు ఐసీడీఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కదిరి ప్రాజెక్టు పరిధిలోని జమ్ములరెడ్డిపల్లికి చెందిన అంగన్‌వాడీ వర్కర్‌ రజియా, మ డకశిర ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్త ఈశ్వరమ్మలపై వేటు వేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఫైలుపై కలెక్టర్‌ ఆమోదం వేశారని, త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో కదిరి ప్రాజెక్టు పరిధిలో కార్యకర్త వైఎ్‌సఆర్‌ పౌష్టికాహారం కిట్ల సరఫరాలో అక్రమాలకు పాల్పడిందని, మడకశిర ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్త కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేసిందని అభియోగాలు వచ్చాయి. విచారణలో వాస్తవమని తేలడంతో వీరిద్దరిపైనా చర్యలు చేపట్టనున్నట్టు ఐసీడీఎస్‌ అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఇటీవలే ఐసీడీఎస్‌ పీడీ చిన్మయదేవిని కలెక్టర్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. తాజాగా మరో ముగ్గురు కార్యకర్తలపై వేటు వేయడం ఆ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.

Updated Date - 2020-12-03T06:18:29+05:30 IST