సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె

ABN , First Publish Date - 2020-02-12T10:18:43+05:30 IST

తమ సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని యూఎఫ్‌బీయూ ప్రతినిధులు హెచ్చరించారు. మంగళవారం స్థానిక

సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె

యూఎఫ్‌బీయూ ప్రతినిధుల హెచ్చరిక 


గుజరాతీపేట, ఫిబ్రవరి 11: తమ సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని యూఎఫ్‌బీయూ ప్రతినిధులు హెచ్చరించారు. మంగళవారం  స్థానిక దీపామహాల్‌ జంక్షన్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ వద్ద యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో బ్యాంక్‌ ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎఫ్‌బీయూ ప్రతినిధులు మాట్లాడుతూ, బ్యాంకర్ల సమస్యలను పరిష్కరించడంలో ఇండియన్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) మొండి వైఖరి అవలంభిస్తుందన్నారు. గత ఐదేళ్ల నుంచి వేతన సవరణ చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే మార్చి 11 నుంచి వరుసగా మూడు రోజుల పాటు సమ్మెను నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికీ ఐబీఏ స్పందించకపోతే ఏప్రిల్‌ 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.  కార్యక్రమంలో యునైటెడ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్యాంకర్స్‌ యూని యన్‌ (యుఎఫ్‌బీయూ) కన్వీనర్‌ కేసీహెచ్‌ వెంకటరమణ, జిల్లా బ్యాంక్‌ ఉద్యోగుల కోఆర్డినేషన్‌ కార్యదర్శి బి.శ్రీనివాసులు, ఆఫీసర్ల యూనియన్‌ కార్యదర్శి కె.రమేష్‌, రామ్‌జీ, బేఫి నాయకులు శ్రీనివాసరావు, ఉద్యోగులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-12T10:18:43+05:30 IST