ఫుట్‌పాత్‌లపై దుకాణాలు నిర్వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-11-26T05:22:44+05:30 IST

ఫుట్‌పాత్‌లపై దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఏఎస్పీ విఠలేశ్వరరావు హెచ్చరించారు. నగరంలోని ట్రాఫిక్‌ను ఆయన బుధవారం పరిశీలించారు.

ఫుట్‌పాత్‌లపై దుకాణాలు నిర్వహిస్తే చర్యలు

గుజరాతీపేట: ఫుట్‌పాత్‌లపై దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఏఎస్పీ విఠలేశ్వరరావు హెచ్చరించారు. నగరంలోని ట్రాఫిక్‌ను ఆయన బుధవారం పరిశీలించారు.  ఏడు రోడ్ల కూడలి నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్‌ వరకు రోడ్డుకిరువైపులా  ఫుట్‌పాత్‌లపై నిర్వహిస్తున్న దుకాణాలతో ట్రాఫిక్‌కు అంతరా యం ఏర్పడుతుందన్నారు. వెంటనే ఈ దుకాణాలను తొలగిం చాలని సంబంధిత యజమానులను ఆదేశించారు.  ప్రెస్‌క్లబ్‌కు ఎదురుగా ఉన్న రెండు లింక్‌రోడ్లను మూసివేయాలని ట్రాఫిక్‌ పోలీసులకు సూచించారు. ఆటోలను మెయిన్‌ రోడ్లకు ఇరువైపులా నిలిపితే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌, టౌన్‌ డీఎస్పీలు ప్రసాదరావు, మహేంద్రముని, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ సత్యనారాయణ, సీఐలు అంబేద్కర్‌, రమణలు పాల్గొన్నారు. 



 111111111111111111111111111111111111111111111111111111111111


పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

 సరుబుజ్జిలి:పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు  పాటించాలని ఎంపీడీవో  పి.మురళీమోహన్‌కుమార్‌ తెలిపారు. బుధవారం రొట్టవలస జడ్పీ ఉన్నతపాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు వచ్చిన విద్యార్థులంతా మాస్కులు  ధరించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం జగనన్న గోరుముద్దపై ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఫపొందూరు: పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించి తరగతులు నిర్వహించాలని జిల్లా పరిశీలకులు, డైట్‌ లెక్చరర్‌ పాత్రుని రమణమూర్తి సూచించారు. బుధవారం   పిల్లలవలస జడ్పీ ఉన్నత పాఠశాల, బి.కంచరాం యూపీ పాఠశాలలను పరిశీలించారు. జగనన్న విద్యాకానుక వారోత్సవాలతోపాటు పలు  పఽథకాల అమలుతీరును పరిశీలించారు.

పిల్లలవలస జడ్పీ పాఠశాలను పరిశీలిస్తున్న జిల్లా పరిశీలకులు 25పొందూరు2..

రొట్టవలసలో విద్యార్థులకు సూచనలిస్తున్న ఎంపీడీవో మురళీమోహన్‌కుమార్‌: 25 సరుబుజ్జిలి 01



1111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111




  పీఆర్సీని వెంటనే ప్రకటించండి

ఫ ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తి

పొందూరు : పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.భానుమూర్తి డిమాండ్‌చేశారు. బుధవారం పొందూరు  ప్రభుత్వోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు  అనుసరిస్తున్న  విధానాలకు నిరసనగా గురువారం చేపట్టే సమ్మె విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డీఏ నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని, బకాయిపడిన డీఏ  విడుదల చేయాలని  డిమాండ్‌ చేశారు. సమావేశంలో  హెచ్‌ఎం  రామరాజు,  ఏపీటీఎఫ్‌ మండలాధ్యక్షుడు ఎం. రమణారావు, కార్యవర్గ ప్రతినిధులు బి. కిషోర్‌, డి. రవికుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-11-26T05:22:44+05:30 IST