-
-
Home » Andhra Pradesh » Srikakulam » Actions if Odisha buys grain
-
ఒడిశా ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు
ABN , First Publish Date - 2020-12-31T05:17:37+05:30 IST
ఒడిశా నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు రుజువైతే సంబంధిత మిల్లర్లపై చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు.

మిల్లర్లకు జేసీ సుమిత్‌కుమార్ హెచ్చరిక
టెక్కలి, డిసెంబరు 30: ఒడిశా నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు రుజువైతే సంబంధిత మిల్లర్లపై చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. బుధవారం నౌపడా-మెళియాపుట్టి రోడ్డులో ని పలు మిల్లులను సబ్‌కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరేతో కలిసి పరిశీలించారు. నిబంధనల మేరకే కొనుగోలు చేయాలని, తప్పిదాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని, ఒక్కో మిల్లు కనీసం 270 క్వింటాళ్ల బియ్యాన్ని లెవీకి అందజేయాల న్నారు. ఆయనతో పాటు తహసీల్దార్ గణపతిరావు, సహాయ పౌరసరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి ఉన్నారు.
నందిగాం: ధాన్యం కొనుగోలుకు సంబంధించి రోజువారీ సమాచారాన్ని నమోదుచేసి అందజేయాలని జేసీ సుమిత్ కుమార్ సూచించారు. బుధవారం ఎంపీడీవో కార్యాల యంలో కొనుగోలు కేంద్రాల సిబ్బంది, వీఆర్‌వోలు, వీఏఏలతో సమీక్షించారు. అనంతరం పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. రైతులకు రవాణాచార్జీలు అందేలా చూడాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్ ఎన్.రాజారావు, ఏవో శ్రీకాంత్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ
రావిపాడు (జలుమూరు): జిల్లాలో ఈ ఏడాది 6 లక్షల మెట్రిక్ ట న్నులు బియ్యం సేకరించి నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ డి.సత్యం తెలిపారు. రావిపాడు ఎఫ్‌సీఐ గొడౌన్‌లో బియ్యం సేకరణను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది నారాయణవలస, కంచిలిలో కొత్తగా గొడౌన్‌లు నిర్మించినందున గత ఏడాది కంటే అదనంగా 30 వేల టన్నులు బియ్యం సేకరణకు అవకాశం కలిగిందన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌సీఐ మేనేజర్ కె.రవిరాజ్, డివిజనల్ మేనేజరు డి.వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.