సాగునీరు అక్రమంగా తరలిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-08-18T11:16:45+05:30 IST

వంవధార ప్రాజెక్టు కుడి కాలువ నుంచి సాగునీటిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు ఎస్‌ఈ పి.రంగారావు హెచ్చరించారు. సోమవారం కుడి

సాగునీరు అక్రమంగా తరలిస్తే చర్యలు

 ‘వంశధార’ ఎస్‌ఈ రంగారావు


హిరమండలం, ఆగస్టు 17: వంవధార ప్రాజెక్టు కుడి కాలువ నుంచి సాగునీటిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు ఎస్‌ఈ  పి.రంగారావు హెచ్చరించారు. సోమవారం కుడి కాలువ పరిధిలోని పిల్ల కాలువ రెగ్యులేటర్లను పరిశీలించారు. అనంతరం స్థానిక వంశధార అతిథి  గృహంలో రైతులు, వంశధార అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుడి ప్రధాన కాలువ ద్వారా పుష్కలంగా సాగునీరు ప్రవహిస్తోందని, కొందరు సొంత అవరసరాలకు అక్రమంగా తరలిస్తున్నారన్నారు.


ఇది మంచి పద్ధతి కాదన్నారు. దీనివల్ల శివారు భూములకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రస్తుతం ప్రధాన కాలువ ద్వారా 750 క్యూసెక్కులు నీరు పంపిస్తున్నామన్నారు. సక్రమంగా నీరు వెళితే శివారు ప్రాంతాలకు అందే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ఈఈలు జి.సుశీల్‌ కుమార్‌, జి.రామచంద్రరావు, డీఈఈలు కె.బ్రహ్మానందం, ఎ.రామకృష్ణ, అగ్రిమిషన్‌ సభ్యుడు జి.రఘురాం పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-18T11:16:45+05:30 IST