ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-11-27T05:02:20+05:30 IST
ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ తహసీల్దార్ మురళీమోహన్‌రావుకు కోరారు.

డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్
ఇచ్ఛాపురం/రూరల్ : ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ తహసీల్దార్ మురళీమోహన్‌రావుకు కోరారు. ఈ మేరకు గురువారం ఇచ్ఛాపురం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. బాహుదానది పరివాహక ప్రాంతంలోని కొళిగాం, బిర్లంగితోపాటు మహేంద్రతనయ నదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. మాఫియాకు అధికారులు కూడా సహకరిస్తున్నారని చెప్పారు. మాఫియాకు పాల్పడిన వారిపై క్రిమినల్‌కేసులు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ పిలక రాజలక్ష్మి, చాట్ల తులసీదాస్‌రెడ్డి, గుజ్జు జగన్నాఽదరెడ్డి పాల్గొన్నారు.ఫ బాహుదానది పరివాహక ప్రాంతంలోని కొలిగాం, బిర్లంగి ఇసుక రీచ్‌ల్లో అక్రమాలను అరికట్టాలని డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజు ఇచ్ఛాపురం రూరల్, ఎస్సై కె.లక్ష్మికి కూడా వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, ఆర్.చిట్టిబాబు, పి.ఆనంద్ పాల్గొన్నారు.