ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-29T05:03:34+05:30 IST

ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం రూరల్‌ మండలం కళ్లేపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి
కలెక్టరేట్‌ ప్రధాన గేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న కళ్లేపల్లి గ్రామస్థులు

కలెక్టరేట్‌ : ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం రూరల్‌ మండలం కళ్లేపల్లి  గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కళ్లేపల్లి పంచాయతీ పరిధిలో కొందరు వందల ఏకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఎటువంటి అనుమతులు లేకుండా రొయ్యల చెరువులు తవ్వుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు విచారణ చేపట్టి ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. 


Updated Date - 2020-12-29T05:03:34+05:30 IST