13 శాతం వేతనం పెంపునకు అంగీకారం

ABN , First Publish Date - 2020-12-14T05:10:39+05:30 IST

స్థానిక రైస్‌మిల్లర్ల కార్మికులు, వ్యాపారుల మధ్య ఆదివారం జరిగిన చర్చలు ఫలించాయి. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 13 శాతం పెంచడానికి అంగీకారం కుదిరింది. కేటీరోడ్డులోని వేణుగోపాల మోడరన్‌ రైస్‌మిల్లు ఆవరణలో కార్మిక, వ్యాపార సంఘ నాయకుల మధ్య చర్చలు జరిగాయి.

13 శాతం వేతనం పెంపునకు అంగీకారం


ఫలించిన రైస్‌మిల్లర్ల కార్మికులు, వ్యాపారుల చర్చలు

పలాస: స్థానిక రైస్‌మిల్లర్ల కార్మికులు, వ్యాపారుల మధ్య ఆదివారం జరిగిన చర్చలు ఫలించాయి. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 13 శాతం పెంచడానికి అంగీకారం కుదిరింది. కేటీరోడ్డులోని వేణుగోపాల మోడరన్‌ రైస్‌మిల్లు ఆవరణలో కార్మిక, వ్యాపార సంఘ నాయకుల మధ్య చర్చలు జరిగాయి. 2022   వరకు పెంచిన వేతనాలు అమలులో ఉంటాయని ఇరు సంఘాల నాయకులు ప్రకటించారు. వ్యాపార సంఘ నాయకుడు డోకి రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్మిక సంఘ అధ్యక్షుడు బొం  పల్లి సింహాచలం, ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, కోనారి రాము పాల్గొన్నారు.


 

Updated Date - 2020-12-14T05:10:39+05:30 IST