హైలెవెల్‌ కెనాల్‌ పనులు వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2020-09-13T10:32:02+05:30 IST

వంశధార-నాగావళి అనుసంధాన హైలెవెల్‌ కెనాల్‌ పనులు వేగవంతం చేయాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు. హైలెవెల్‌ కెనాల్‌ పనులు ప్రగ

హైలెవెల్‌ కెనాల్‌ పనులు వేగవంతం చేయండి

స్పీకర్‌ తమ్మినేని సీతారాం  


(కలెక్టరేట్‌, శ్రీకాకుళం, సెప్టెంబరు 12):

 వంశధార-నాగావళి అనుసంధాన హైలెవెల్‌ కెనాల్‌ పనులు వేగవంతం చేయాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు. హైలెవెల్‌ కెనాల్‌ పనులు ప్రగతిపై శనివారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రాధాన్యతా ప్రాజెక్టులలో వంశధార-నాగావళి అనుసంధాన హైలెవెల్‌ కెనాల్‌ పనులు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లులు త్వరగా విడుదల చేసేందుకు కృషి చేస్తాం. భూ సేకరణలో సమస్యలు ఉన్న చోట రైతులతో మాట్లాడుతాం.


ఇతర ప్రాంతాల్లో భూ సేకరణ పెండింగ్‌లో లేకుండా చూడాలి. నాగావళి- వంశధార ఆనుసంధానం వల్ల అదనంగా కొంత ఆయకట్టుకు నీరందుతుంది’ అని తెలిపారు. సమావేశంలో జేసీ సుమిత్‌ కుమార్‌ జలవనరుల శాఖ చీప్‌ ఇంజినీర్‌ సీహెచ్‌ శివరాం ప్రసాద్‌, వంశధార ఎస్‌ఈ పి.రంగారావు, ఈఈ జి.సుశీల్‌ కుమార్‌, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ కాశీ విశ్వనాథ, ఉపకార్యనిర్వాహక ఇంజినీర్‌ రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-13T10:32:02+05:30 IST