-
-
Home » Andhra Pradesh » Srikakulam » Accelerate daytoday tasks
-
నాడు-నేడు పనులు వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2020-12-11T04:57:55+05:30 IST
నాడు-నేడు పథకం కింద మంజూరైన పనులు వేగవంతం చేయాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తరగతి గదులు సిద్ధం చేయాలని కలెక్టర్ జె.నివాస్ కోరారు. గురువారం పలాస ప్రభుత్వోన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు.

పలాస: నాడు-నేడు పథకం కింద మంజూరైన పనులు వేగవంతం చేయాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తరగతి గదులు సిద్ధం చేయాలని కలెక్టర్ జె.నివాస్ కోరారు. గురువారం పలాస ప్రభుత్వోన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పనులు నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. సొంత డబ్బులు పెట్టి కరోనాను సైతం లెక్కచేయ కుండా పనులు చేశామని విద్యాకమిటీ చైర్మన్ జి.మన్మథరావు కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో రివాల్వింగ్ ఫండ్ త్వరలోనే మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం పాఠశాలలో బోధన పై హెచ్‌ఎం డి.రామారావును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కమిషనర్ ఎన్‌వీవీ నారాయణ, తహసీల్దార్ మధుసూదనరావు, ఎంఈవో శ్రీనివాసరావు ఉన్నారు.