జిల్లాలో 500 ప్రత్యేక పడకలు

ABN , First Publish Date - 2020-03-23T09:14:31+05:30 IST

కరోనా నివారణకు ఐసోలేషన్‌ ఉత్తమ మార్గమని, ఇందు కోసం 500 ప్రత్యేక పడకలు ఏర్పాటు

జిల్లాలో 500 ప్రత్యేక పడకలు

రెండు సర్త్వెలెన్స్‌ బృందాలు, 

ఐదు బ్యాచ్‌లుగా విధులు

కరోనా కేసు నమోదైతే 

మూడు కిలోమీటర్లు కంటోన్మెంట్‌ జోన్‌ 

కలెక్టర్‌ నివాస్‌


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మార్చి 22: కరోనా నివారణకు ఐసోలేషన్‌ ఉత్తమ మార్గమని, ఇందు కోసం 500 ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ నివాస్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో కరోనాపై అధికా రులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇతర దేశాల నుంచి జిల్లాకు వచ్చే వారిని ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రత్యేక గదుల్లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. కరోనా అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తిం చేందుకు జిల్లాలో మరోసారి ఇంటింట సర్వే చేయాలని ఆదేశించారు.


జిల్లాలో 2సర్వెలెన్స్‌ బృందాలు 5బ్యాచ్‌లు గా పనిచేస్తా యన్నారు. ఈ బృందాలు రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు విధులు నిర్వహిస్తాయని, ఒక్కో బృందంలో పల్మనాల జిస్ట్‌, ఎనస్తీషియా, జనరల్‌ మెడిసన్‌, డ్యూటీ వైద్యుడు ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్త్వెలెన్స్‌ ప్రోగ్రామ్‌ కింద ఒక్కో డివిజ న్‌కు 40 బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒక్కో బృందంలో పురుష, మహిళా ఆరోగ్య పర్యవేక్షకులు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.


పది బృం దాలకు ఒక వైద్యాధికారి నేతృత్వం వహిస్తారని, కోవిడ్‌ కేసులను ఈ బృందాలు గుర్తించాలని తెలిపారు. కేసు తీవ్రత ఆధారంగా కలెక్టర్‌ కార్యాలయం, డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రత్యేకంగా కేటాయించిన 108 వాహ నాలకు సమాచారం అందించాలని కోరారు. పాజిటివ్‌ కేసు నమోదైతే ప్రభావిత ప్రాంతం (కంటోన్మెంట్‌ జోన్‌) కింద మూడు కిలోమీటర్ల మేర కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు.  


 కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి కోసం జిల్లా ఆస్పత్రిలో 40పడకలతో పాటు అదనంగా మరో 50 పడకలను సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. టెక్కలి, పాలకొండ, రాజాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 5 చొప్పున, సీతంపేటలో 1, బారువలో 4, రణస్థలంలో 3, బుడితిలో 3, కవిటిలో 2, పాతపట్టణంలో 2, నరసన్నపేటలో 4, హరిపురంలో 6, కోటబొమ్మాళి, ఇచ్ఛాపురం, సోంపేట, పలాసలో 2 చొప్పున పడకలను సిద్ధం చేయాలని ఆదేశించారు.


అలాగే ప్రైవేట్‌ ఆస్పత్రిల్లో జేమ్స్‌లో 15, జీఎంఆర్‌లో 16, కిమ్స్‌లో 10, గొలివి, సింధూర, అమృత, పీవీఆర్‌ ఆస్పత్రిల్లో 2చొప్పున ఐసోలేషన్‌ పడకలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వైద్యులకు పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌తో పాటు ఎన్‌-95 మాస్క్‌లను సరఫరా చేస్తున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి జిల్లాకు 259 వచ్చారని తెలిపారు. ఇందులో 14రోజులు పూర్తి అయినవారు కూడా ఉన్నారని, ఇందులో అనుమానస్ప దంగా ఉన్న ఒక కేసు నమూనాలను పరీక్షలకు పంపామని, నివేదిక రావాల్సి ఉందని చెప్పారు.


ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు, జేసీ-2 గున్నయ్య, డీఆర్వో బి.దయానిధి, జిల్లా నీటి యాజ మాన్య సంస్థ కూర్మారావు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ రాజారావు, మత్స్యశాఖ జేడీ కృష్ణమూర్తి, డీపీవో రవికుమార్‌, జడ్పీ సీఈవో చక్రధరరావు, డీఎంహెచ్‌వో చెంచయ్య, డీసీహెచ్‌ఎస్‌ సూర్యారావు, ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


నేడు ‘స్పందన’ రద్దు 

కరోనా కారణంగా జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్‌ నివాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా నివారణ దృష్ట్యా ప్రజలు స్పందన కార్యక్రమానికి హాజరు కావద్దని  సూచించారు. అత్యవసర సమస్య లుంటే సంబంధిత అధికారులకు, కలెక్టర్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి వివరాలు తెలి యజేయాలని తెలిపారు. అలాగే ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించ నున్న ‘స్పందన’ కూడా రద్దు చేస్తున్నట్టు ఎస్పీ అమ్మిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2020-03-23T09:14:31+05:30 IST