40 వేల మంది కార్మికులు ఇళ్లకే పరిమితం

ABN , First Publish Date - 2020-03-23T09:29:50+05:30 IST

జిల్లాలో జనతా కర్ఫ్యు నేపథ్యంలో పలుచిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. భారీ పరిశ్రమలు మినహా మిగతా

40 వేల మంది కార్మికులు ఇళ్లకే పరిమితం

ఎచ్చెర్ల: జిల్లాలో  జనతా కర్ఫ్యు నేపథ్యంలో పలుచిన్న, మధ్య తరహా  పరిశ్రమలు మూతపడ్డాయి. భారీ పరిశ్రమలు మినహా మిగతా పరిశ్రమలన్నీ కర్ఫ్యూను పాటించాయి.పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకు గల పలు పరిశ్రమలు  ఉదయం ఏడు  నుంచి రాత్రి  తొమ్మిది గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటించాల ని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనకు  సంఘీభావం తె లిపాయి. దీంతో సుమారు ఆయా పరిశ్రమల్లోపనిచేస్తు న్న 40వేల మంది  కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యా రు. జిల్లాలోని పైడిభీమవరం, నవభారత్‌ జంక్షన్‌, ఆమ దాలవలస, పలాస ప్రాంతాల్లో పారిశ్రామికవాడలు, రాజాం, పాలకొండ పరిసరాల్లో పరిశ్రమల్లో పని చేస్తున్న సుమారు 40 వేల మంది కార్మికులు, ఉద్యోగులు జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.


భారీ పరిశ్రమల్లో ఉదయం ఆరు గంటలకు విధులకు హాజరైన కార్మి కులు, ఉద్యోగులు బీ షిఫ్ట్‌లో కూడా పని చేశారు. రాత్రి 10 గంటల వరకు రెండు షిప్టులను ము గించి ఇంటి ముఖం పట్టారు.  సాధారణంగా భారీ పరి శ్రమలు మూసివేతకు  కనీసం 48 గంటల ముందు ప్రక్రియ ప్రారంభించాల్సిఉంటుంది.దీని దృష్ట్యా భారీ పరి శ్రమ లు మూతవేయకుండా షిఫ్టుల్లో మార్పులుచేసి కర్ఫ్యూకు సహకరించారు.ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది వరకు కార్మికులు ఏ,బీ షిప్టుల్లో డ్యూటీ ఉన్నా రని నాగార్జున అగ్రికం వైస్‌ప్రెసిడెంట్‌  సీవీ రాజులు తెలిపారు. ఏ ఒక్కరూబయటకు రాలేదని చెప్పారు.


 పరిశ్రమల్లో థర్మల్‌ స్కానర్లు

కరోనా వైరస్‌ నేపథ్యంలో పరిశ్రమల్లో ఉద్యోగులు, కార్మికులు ప్రవేశించగానే థర్మల్‌ స్కానర్లతో పరిశీలిస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ నమోదైతే వెంటనే వైద్యుడితో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా అదుపులోకి వచ్చే వరకు ఇంటి నుంచి పరిశ్రమకు తప్ప మధ్యలో ఫంక్షన్లు, పార్టీలకు, ఇతర  కార్యకలాపాలకు వెళ్లొద్దని కార్మికులకు పరిశ్రమ యాజమాన్యాలు సూచిస్తున్నాయి. మద్యం, దూమపానం, గుట్కాలు వంటివి ముట్టుకోవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.  

Updated Date - 2020-03-23T09:29:50+05:30 IST