జిల్లాకు 30,715 కొత్త పింఛన్లు
ABN , First Publish Date - 2020-02-08T09:36:49+05:30 IST
ప్రభుత్వం జిల్లాకు 30,712 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని, వీటిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత

ఆధారాలుంటే పాతవి పునరుద్ధరణ
అర్హులు ఆందోళన చెందొద్దు
కలెక్టర్ నివాస్
కలెక్టరేట్, ఫిబ్రవరి 7: ప్రభుత్వం జిల్లాకు 30,712 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని, వీటిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విలేఖరులతో మాట్లాడుతూ.. కొత్తగా మంజూరైన పింఛన్లలో 25,603 మంది జాబితా పరిశీలనలో ఉందని, మిగిలిన వాటి ని పంపిణీ చేశామన్నారు. ఇంటింటా పరిశీలించనున్నామని చెప్పారు. పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ప్రతి ఇంటికి పక్కాగా మా పింగ్ చేస్తామని, ఇందులో సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేస్తామని చెప్పా రు. జిల్లాలో మొత్తం 3,45,940 పింఛన్లు ఉండగా వీటిలో గ్రామాల్లో 3,18,597, పట్టణాల్లో 27,343 ఉన్నాయని చెప్పారు.
నిబంధనల మేరకే తొలగింపు
జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు ప్రకారమే కొన్ని పాత పింఛన్లు తొలగిం చామని, అయితే ఆధారాలుంటే వారంలోగా ఎంపీడీవోలకు అందజేస్తే పరిశీలించి పున రుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్హు లెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో బయో మెట్రిక్ హాజరు తప్పనిసరన్నారు. దీనికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పా రు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ విధానంలో హాజరు వేయాలన్నారు.
సచివాలయాలో ఇళ్ల లబ్ధిదారుల జాబితా
గ్రామ సచివాలయాల్లో ఇళ్ల లబ్ధిదారుల జాబితా లను గ్రామస్థుల పరిశీల నకు ఏర్పాటు చేశామన్నారు. గురువారం ప్రారంభమైన గ్రామసభలు 4 రోజుల పా టు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 67 వేల మంది స్థ లం ఉన్నట్లు, 52,106 మందికి ఇంటి స్థలాలు లేవని నమోదు చేసుకున్నారని, వీరందరికీ పొజిషన్ సర్టిఫి కేట్లు, పట్టాలు ఉగాది నాటికి అందిస్తామన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఎ.కల్యాణ్ చక్రవర్తి ఉన్నారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి..వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్
కలెక్టరేట్: స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎల్వీ రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట ర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేం ద్రాల గుర్తింపు పూర్తి చేయాలని కోరారు. ఆర్వోలు, ఏఆర్వోల జాబితాలను ప్రతిపాదించాలని సూచించారు. ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయా లని, దీనికి ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాలో సమస్యత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే నియమావళి అమలు చేస్తామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.గీతాదేవి, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.