‘ఎస్పీ స్పందన’కు 23 వినతులు

ABN , First Publish Date - 2020-12-15T06:17:36+05:30 IST

జిల్లా పోలీసు కార్యాల యంలో ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 23 వినతులు అందా యి.

‘ఎస్పీ స్పందన’కు 23 వినతులు
బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ అమిత్‌ బర్దర్‌

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి : జిల్లా పోలీసు కార్యాల యంలో ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 23 వినతులు అందా యి. ఈ సందర్భంగా బాధితులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం జూమ్‌ కాన్ఫ రెన్స్‌ ద్వారా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల సీఐలతో ఎస్పీ మాట్లాడారు. స్పందనలో వచ్చిన వినతులను పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
కలెక్టరేట్‌ : కలెక్టరేట్‌ లో సోమవారం నిర్వహించిన ‘కలెక్టర్‌ టెలీ స్పందన’కు జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదులను డీఆర్వో దయా నిధి నమోదు చేసుకున్నారు. రెవెన్యూ, పౌరసరఫరాల స మస్యలపై ఎక్కువ వినతులు వచ్చాయి. వీటి పరిష్కారాని కి సంబంధిత శాఖలకు పంపించినట్టు తెలిపారు.
ఐటీడీఏ స్పందనకు 62 ...
సీతంపేట:
సీతంపేటలోని ఐటీడీఏ  కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనకు 62 వినతులు వచ్చి నట్లు పీవో సీహెచ్‌ శ్రీధర్‌  తెలిపారు. వినతులపై సెక్టోరియల్‌ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించా లని పీవో ఆదేశించారు. ఈఈ  జి.మురళి, పీఏవో  భవానీశంకర్‌, వెలుగు ఏపీడీ డైజీ పాల్గొన్నారు.

Read more