బెల్లపు ఊట ధ్వంసం

ABN , First Publish Date - 2020-09-25T10:47:19+05:30 IST

బెల్లపు ఊట ధ్వంసం

బెల్లపు ఊట ధ్వంసం

వంగర/పాలకొండ: వంగర మండలంలోని వీవీఆర్‌పేటలో నాగావళినది ఒడ్డున మూడు చోట్ల 5,100 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లు  పాలకొండ ఎక్సైజ్‌ ఎస్‌ఐ రమణమూర్తి తెలిపారు. గురువారం పక్కా సమాచారంతో గ్రామానికి  చేరుకున్న  సిబ్బంది  దాడిచేశారు. నాగావళి నదీ పరిసరాల్లో మూడుచోట్ల సారా నిల్వలు గుర్తించి ధ్వంసం చేసి  కేసులు నమోదుచేశారు. సిబ్బంది  వస్తున్నట్లు   సమాచారం రావడంతో  తయారీదారులు పరారయ్యారని గ్రామస్థులు చెబుతున్నారు. కోతులగుమ్మడ  వద్ద 1,900 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-25T10:47:19+05:30 IST