ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి
ABN , First Publish Date - 2020-12-30T05:58:44+05:30 IST
మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపై పడటంతో యువకుడు మృతి చెందాడు.

అద్దంకి, డిసెంబరు 29: మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపై పడటంతో యువకుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన గంగవర పు బాజీ (19) క్రిస్మస్ పండుగకు అమ్మమ్మ దగ్గరకు ధర్మవరం వచ్చాడు. మంగళవారం వలపర్లలో బంధు వుల ఇంటికి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా ధర్మవరం సమీపంలోని క్రషర్‌ల వద్ద మలుపులో అదుపు తప్పి పడి పోయాడు. తీవ్రంగా గాయపడిన బాజీ అక్కడి కక్కడే మృతి చెందాడు. బాజీ తండ్రి ప్రకాశం కూడా గతంలో రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలిం చారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.