గెంటేసి.. గేట్లేశారు...!

ABN , First Publish Date - 2020-12-30T05:47:46+05:30 IST

ఎస్సీల ఓట్లతో గెలిచి, ఇప్పుడు తమ భూమిని కాపాడాలని కోరేందుకు వస్తే గెంటేసి గేట్లేస్తారా.. అంటూ సీఎ్‌సపురం మండలం కోవిలంపాడు పంచాయతీ మిట్టపాలెం ఎస్సీ కుటుంబాల వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గెంటేసి.. గేట్లేశారు...!
ఎమ్మెల్యే మధుసూదనయాదవ్‌ ఇంటి ముందు నిరసన తెలుపుతున్న ఎస్సీలు


ఎస్సీల ఓట్లతో గెలిచి ఇంతగా అవమానిస్తారా!
భూమిని కాపాడాలని వస్తే దౌర్జన్యం తగదు..
కనిగిరి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన             
మిట్టపాలెం ఎస్సీ కుటుంబాలు

కనిగిరి, డిసెంబరు 29 : ఎస్సీల ఓట్లతో గెలిచి, ఇప్పుడు తమ భూమిని కాపాడాలని కోరేందుకు వస్తే గెంటేసి గేట్లేస్తారా.. అంటూ సీఎ్‌సపురం మండలం కోవిలంపాడు పంచాయతీ మిట్టపాలెం ఎస్సీ కుటుంబాల వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం కనిగిరిలో ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ ఇంటిని ముట్టడించి నిరసన చేపట్టారు. మిట్టపాలెం గ్రామస్థులకు పూర్వం మా దిగ మాన్యం కింద ఇచ్చిన 5.42ఎకరాల భూమిని ఎమ్మె ల్యే సామాజికవర్గానికి చెందిన చిన్న వెంకటనారాయణ ఆక్రమించుకున్నాడని ఎస్సీలు వాపోయారు. ఈ విషయా న్ని గతంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని అప్పుడు తమకు తహసీల్దార్‌ను కలవాలని చెప్పారన్నారు. తహసీల్దార్‌ను కలిస్తే రికార్డులను పరిశీలించి తమ భూమిగా నిర్ధారించినప్పటికీ చిన్నవెంకటనారాయణ తమపై దు ర్భాషలాడుతూ ‘ఎమ్మెల్యే మావాడు.. ఏం చేసుకుంటారో పొండి అని..’ దౌర్జన్యానికి పాల్పడ్డాడని గ్రామస్థులు వా పోయారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పేందుకు వస్తే తమను గెంటేసి గేట్లేసేశారని కన్నీటి పర్యంతమయ్యారు. కాపాడాల్సిన నాయకుడే దౌర్జన్యకారులకు అండగా నిలబడుతూ తమకు అన్యాయం చేయడం బాధగా ఉందన్నారు. మహిళలతో కలిసి ఎమ్మెల్యే ఇంటికి వస్తే కనీసం కనికరం కూడా లేకుండా బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. బాధితుల రాకతో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమను తిప్పి పంపించాలని గన్‌మెన్‌ను ఎమ్మెల్యే పురమాయించారని బాధితులు వాపోయారు. వైసీపీ నేత గఫూర్‌ వచ్చి వారితో మాట్లాడి సర్దిచెప్పి పంపించారు.

Updated Date - 2020-12-30T05:47:46+05:30 IST