వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ABN , First Publish Date - 2020-12-06T07:04:36+05:30 IST

దర్శి వైసీపీలో మళ్లీ విభేదాలు బహి ర్గతమయ్యాయి. మండల కేంద్రమైన ముండ్లమూరులో ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వర్గీయుల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది.

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ముండ్లమూరులో మద్దిశెట్టి, బూచేపల్లి వర్గాల ఘర్షణ

పోలీస్‌ స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు

ముండ్లమూరు, డిసెంబరు 5 : దర్శి వైసీపీలో మళ్లీ విభేదాలు బహి ర్గతమయ్యాయి. మండల కేంద్రమైన ముండ్లమూరులో ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వర్గీయుల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. వైసీపీలోని ఇరువర్గాల మధ్య పాతకక్షలు ఉన్న విషయం తెలిసిందే. వాటిని మనసులో పెట్టుకొని మళ్లీ ఘర్షణ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గానికి చెందిన  వైసీపీ మండల కన్వీనర్‌ సూర్యదేవర అంజయ్య, ఎమ్మెల్యే వర్గానికి చెందిన వైసీపీ గ్రామ నాయకుడు అంబటి వెంకటేశ్వరరెడ్డి వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి బాహాబాహీకి దిగారు. చొక్కాలు చించుకున్నారు. అనంతరం అంజయ్య వర్గం వారు భారీగా పోగై వెంకటేశ్వరరెడ్డి ఇంటి పైకి వెళ్లారు. దర్శి సీఐ ఎండీ మొయిన్‌ తన సిబ్బందితో గ్రామానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు శనివారం ఉదయం ఇరువర్గాలు పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

Read more