-
-
Home » Andhra Pradesh » Prakasam » women wellfare
-
మహిళలు సాధికారికతను సాధించాలి
ABN , First Publish Date - 2020-12-16T05:10:17+05:30 IST
మహిళల సాధికారత, భద్రతలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కార్డ్స్ సంస్థ ప్రతినిధి గుర్రం సుధీర్‌బాబు అన్నారు.

కొమరోలు, డిసెంబరు 15 : మహిళల సాధికారత, భద్రతలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కార్డ్స్ సంస్థ ప్రతినిధి గుర్రం సుధీర్‌బాబు అన్నారు. మహిళ శిశుసంక్షేమశాఖ మహిళల రక్షణ కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్న పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. గత నెల నవంబరు 28 నుంచి మార్చి 8వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. మండలంలోని ఇడమకల్లు గ్రామంలో బాలికలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహిళ పోలీసు విద్యాభవాని, ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు గిరిజ, బాలయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.