మద్యంపై మహిళల ఆందోళన

ABN , First Publish Date - 2020-05-18T10:27:42+05:30 IST

గృహల మధ్య ఉన్న మద్యం దుకా ణాన్ని తొలగించాలని కోరుతూ మహిళలు ఆందోళన కు దిగారు.

మద్యంపై మహిళల ఆందోళన

దుకాణం తెరవనీయకుండా నిరసన  


బల్లికురవ, మే 17: గృహల మధ్య ఉన్న మద్యం దుకా ణాన్ని తొలగించాలని కోరుతూ మహిళలు ఆందోళనకు దిగారు. ఆదివారం బల్లికురవలో జరిగిన ఈ సంఘటన లో మద్యం దుకాణానికి తాళం వేసి నిరసన కార్యక్రమం నిర్వ హించారు. గ్రామంలోని ప్రధాన బొడ్డురాయి బజారులో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటుచేయడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.   ఇక్కడి నుంచి దుకా ణాన్ని తీసేయాలని మహిళలు పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇటీవల లాక్‌డౌన్‌ తో షాపు మూతపడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ దుకాణం తెరవడంతో సమస్యలు మొదలయ్యాయి. కొందరు మద్యం ప్రియులు బైక్‌లపై వేగంగా వెళ్తుండడంతో చిన్నచిన్న ప్రమాదాలు జరుగు తున్నాయి.


వీధుల్లో చిన్నపిల్లలు తిరుగుతుండ డంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని మహి ళలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొ న్నిచోట్ల మద్యం దుకాణాలు లేకపోవడంతో నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల  నుంచి, పలు రెడ్‌జోన్ల నుంచి మద్యం కోసం ఇక్కడకు వస్తున్నారు.  దీంతో కరోనా వైరస్‌ విజృంభించే అవకాశముందని స్థానికులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు.  వెంటనే దుకాణా న్ని మూసివే యించాలని మహిళలు భీష్మించారు. విషయం తెలుసుకు న్న ఎస్‌ఐ శివనాంచారయ్య అక్కడకు చేరుకొని  దుకాణం తొలగించేలా ఎక్సైజ్‌ అధికారులతో మాట్లాడు తానని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన విరమిం చారు. అప్పటికే పలు ప్రాంతాల నుంచి మద్యం కోసం వచ్చిన వారు వెను దిరిగి వెళ్లారు. 


Updated Date - 2020-05-18T10:27:42+05:30 IST