హత్య కేసులో మహిళ అరెస్టు

ABN , First Publish Date - 2020-03-18T11:20:51+05:30 IST

కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టుచేశారు. సంతనూతలపాడు మండలం

హత్య కేసులో మహిళ అరెస్టు

ఒంగోలుక్రైం, మార్చి 17 :  కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన  మహిళను పోలీసులు అరెస్టుచేశారు. సంతనూతలపాడు మండలం పేర్న మిట్టకు చెందిన మిడసల మాధవీలత ఈ సంఘటనలో అరెస్టు అయ్యారు. 2018 అక్టోబరు7న కుమారుడు జనార్దన్‌, కుమార్తె విజయలక్ష్మితో పాటు మాధవీలత కూల్‌డ్రింక్‌లో చీమల మందువేసు కొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో ఆమె కుమార్తె విజయలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందగా మాధవీలత, కుమారుడు జనార్దన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు.


విజయలక్ష్మి మృతికి ఆమె తల్లి మాధవీలత కారణమని, కుమారుడు జనార్దన్‌ను అంతమొందిం చేందుకు  మాధవీలత ప్రయత్నించిందని భావించి కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. కాగా, మాధవీలత భర్త కోటేశ్వరరావు, ఒంగోలులో ఫైనాన్స్‌ కంపెనీ నిర్వహించే బేతంశెట్టి రమేష్‌ వద్ద పనిచేసు ్తన్నాడు. అప్పట్లో కోటేశ్వరరావును  రమేష్‌తోపాటు కొంతమంది కొట్టడం కారణంగా కోటేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్సపొం దుతూ 2018అగస్టులో మృతి చెందాడు.  మాధవీలతకు ఖర్చులు నిమిత్తం కొంత నగదు ఇస్తామన్న వ్యక్తులు ఇవ్వకపోవడంతో మాధవీలత తన కుటుంబ సభ్యులను అంతం చేసి ఆత్మహత్యాయత్నం చేసిందని విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కోటేశ్వరరావు మృతిపై చర్యలు తీసుకోకుండా మాధవీలతను అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-03-18T11:20:51+05:30 IST