-
-
Home » Andhra Pradesh » Prakasam » Wine botels
-
అక్రమ మద్యంతో వ్యక్తి అరెస్టు
ABN , First Publish Date - 2020-11-25T05:47:58+05:30 IST
మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామంలో అక్రమంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 20 విస్కి బాటిల్స్‌ను ఎస్‌ఈబీ సీఐ శ్రీనివాసరావు స్వాధీనపర్చుకున్నారు.

సంతమాగులూరు, నవంబరు 24 : మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామంలో అక్రమంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 20 విస్కి బాటిల్స్‌ను ఎస్‌ఈబీ సీఐ శ్రీనివాసరావు స్వాధీనపర్చుకున్నారు. మద్యంను తీసుకువెళ్తున్న కుంచాల నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఐ ఆంజనేయలు, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.