ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ABN , First Publish Date - 2020-12-30T06:10:56+05:30 IST

జీవితాంతం కలిసిమెలసి ఉండాల్సిన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన  భార్య
కేసు వివరాలను వెల్లడించిన దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు


దర్శి, డిసెంబరు 29 : జీవితాంతం కలిసిమెలసి ఉండాల్సిన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. స్ధానిక పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కె.ప్రకాశరావు కేసు వివరాలను వెల్లడించారు. సంతమాగులూరు మండలం సంతమాగులూరు గ్రామానికి చెందిన చెన్నుపల్లి సైదాలక్ష్మీ, శ్రీనివాసరావులు దంపతులు. సైదాలక్ష్మీ కూలీ పనులకు వెళ్తుంది. ఈ క్రమంలో నర్సరావుపేట రూరల్‌ మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ నల్లగంగుల వెంకటరెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం గమనించిన భర్త శ్రీనివాసరావు ఆమెను మందలించాడు.   ఈ విషయం సైదాలక్ష్మీ తన ప్రియుడితో చెప్పింది. వీరు ఎలాగైనా శ్రీనివాసరావును అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో  ఈ నెల 25వ తేదీ రాత్రి శ్రీనివాసరావు మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. నిద్రపోయిన తర్వాత సైదాలక్ష్మీ ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని ఇరువురు కలిసి శ్రీనివాసరావును గొంతునులిమి హత్య చేశారు. ఇరువురు  కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ ప్రకాశరావు తెలిపారు. ప్రధాన నిందితురాలు సైదాలక్ష్మీని మంగళవారం అరెస్టు చేశామని, రెండవ నిందితుడిని త్వరలో పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అద్దంకి సిఐ ఐ.ఆంజనేయరెడ్డి, సంతమాగులూరు ఎస్సై జి.శివన్నారాయణ, సిబ్బంది సురే్‌షరెడ్డి, మస్తాన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T06:10:56+05:30 IST