తప్పనిసరిగా హెల్మెట్‌

ABN , First Publish Date - 2020-12-19T05:56:50+05:30 IST

విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడిపేటపుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించడంతోపాటు వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని కంభం ఎస్‌ఐ మాధవరావు తెలిపారు.

తప్పనిసరిగా హెల్మెట్‌

కంభం, డిసెంబరు 18 : విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడిపేటపుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించడంతోపాటు వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని కంభం ఎస్‌ఐ మాధవరావు తెలిపారు. శుక్రవారం స్థానిక వాసవి జూనియర్‌ కళాశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. పలువురు విద్యార్థులు హెల్మెట్‌ లేకుండా ట్రిపుల్‌ రైడింగ్‌, రద్దీ ప్రదేశాలలో అతివేగంగా వెళుతూ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. పలువురు మాదకద్రవ్యాలు వినియోగిస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వీటి వలన జరిగే అనర్ధాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రాము, విద్యార్థులు పాల్గొన్నారు.


Read more