సాధికారత దిశగా అడుగులు

ABN , First Publish Date - 2020-12-06T06:45:07+05:30 IST

మహిళలు సాధికారత దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు.

సాధికారత దిశగా అడుగులు
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న వాసిరెడ్డి పద్మ

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

ఒంగోలు నగరం, నవంబర్‌ 5: మహిళలు సాధికారత దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. శనివారం స్త్రీ,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలోని స్పం దన సమావేశం హాలులో  ‘మహిళల రక్షణ చట్టాలు, హక్కులపై’ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళాంధ్రప్రదేశ్‌ సాధన కోసం రాష్ట్రప్రభుత్వం మహిళా మార్చ్‌ ఎట్‌దిరేట్‌ 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో బృందాలు ఏర్పా టు చేసుకుని  నిర్మాణాత్మకంగా మహిళలను ఒక గొప్ప శక్తిగా ఆవిష్కరించుకోవాలని ఆమె కోరారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, ఎమ్మెల్సీ పోతల సునీత, డాక్టర్‌ నాయర్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు, జేసీ చేతన్‌, కృష్టవేణి, మహిళా కమిషన్‌ సభ్యులు సూయిజ్‌, రమాదేవి, చెల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ అధ్యక్షురాలు భారతి, దిశ డీఎస్సీ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T06:45:07+05:30 IST