-
-
Home » Andhra Pradesh » Prakasam » water to kandleru cheruvu
-
వెలిగొండ తీగలేరును చిన్న కండ్లేరుకు అనుసంధానం చేస్తాం
ABN , First Publish Date - 2020-12-29T05:08:06+05:30 IST
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువను పుల్లలచెరువు చిన్నకండ్లేరు చెరువుకు అనుసంధానం చేసి పుల్లలచెరువు మండలాన్ని కరువు రహిత మండలంగా మారుస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు.

83 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయిస్తాం
పుల్లలచెరువులో కరువును పారద్రోలుతాం
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
పుల్లలచెరువు, డిసెంబరు 28: పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువను పుల్లలచెరువు చిన్నకండ్లేరు చెరువుకు అనుసంధానం చేసి పుల్లలచెరువు మండలాన్ని కరువు రహిత మండలంగా మారుస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. మల్లాపాలెం గ్రామంలో ఇళ్లపట్టాల పంపిణీ, ఇళ్లనిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ద్వారా పుల్లలచెరువు చిన్నకండ్లేరుకు అనుసంఽధానం 11 వేల ఎకరాలకు శాశ్వతంగా సాగు నీరు, తాగు నీరు అందిస్తామన్నారు. తీగలేరు 5వ కాలువకు 83 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. నియోజకవర్గంలో 2810 మందికి మొదటి విడతగా ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, ఆసరా, ఆరోగ్య శ్రీ వంటి సంక్షేమ పథకాలతో సంక్షేమ ప్రభుత్వంగా మారిందని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి చంద్రలీల, హౌసింగ్ పీడీ సాయినాధ్‌కుమార్, తహసీల్దార్ చింతలపూడి అశోక్‌రెడ్డి, హౌసింగ్ డీఈఈ ఏ శ్రీనివాసరావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు అడిపి కరుణాకర్, ఏపీవో నాగేశ్వరరావు, వైసీపీ మండల కన్వీనరు ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ అభ్యర్ధి మందా లాజరు, మాజీ ఎంపీపీ ఎం.సుబ్బారెడ్డి, యండ్రపల్లి స్వామి, మండల నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డి, యల్లారెడ్డి రోశిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పండుగలా పట్టాల పంపిణీ - మంత్రి సురేష్
త్రిపురాంతకం : ప్రభుత్వం పేదలకు అందించే పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగుతోందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 16 ఎకరాల లే-అవుట్‌లో 582 ప్లాట్లు ఏర్పాటు చేసి, 487 మంది మహిళలకు పట్టాలు పంపిణీ చేస్తున్నామని, మొదటి విడతగా 335 ఇళ్ళు కూడానిర్మించేందుకు అనుమతులు వచ్చాయని అన్నారు. ఒక్కో ఇంటికి రూ. 1.80 లక్షలతో నిర్మించనున్నామని, లబ్దిదారులకు ఇళ్ళ నిర్మాణానికి మూడు రకాల అవకాశాలు ఇస్తున్నామని అన్నారు. లే-అవుట్ ప్రాంతంలో మంచినీటి వసతి, విద్యుత్, తారు రోడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్‌వాడీల్లో అంగ్లమాద్యమంలో ఎల్‌కేజీ, యూకేజీ ప్రవేశ పెడతామన్నారు. అనంతరం లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా హౌసింగ్ పీడీ సాయినాద్, డీఎల్‌డీవో సాయికుమార్, తహసీల్దారు వి.కిరణ్, ఎంపీడీవో సుదర్శనం, ఎంఈవో నాయక్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ ఆళ్ళ ఆంజనేయరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.