ప్రతి ఇంటికీ కుళాయి!

ABN , First Publish Date - 2020-12-26T05:37:44+05:30 IST

ప్రతి ఇంటికి స్వ చ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో జ లజీవన్‌ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని గ్రామాల్లో సమర్థంగా అమలు చేసే బా ధ్యతను ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు అ ప్పజెప్పింది.

ప్రతి   ఇంటికీ కుళాయి!

జిల్లాలో ‘జలజీవన్‌’ పనులు ప్రారంభం 

తొలివిడత రూ.5లక్షలలోపు అంచనా పనులకు శ్రీకారం

మార్చి నెలాఖరుకు లక్ష్యం పూర్తికి ఆర్‌డబ్ల్యూఎస్‌ చర్యలు


ఒంగోలు(జడ్పీ), డిసెంబరు 25: ప్రతి ఇంటికి స్వ చ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో జ లజీవన్‌ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని గ్రామాల్లో సమర్థంగా అమలు చేసే బా ధ్యతను ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు అ ప్పజెప్పింది. ఈ పథకం నిమిత్తం సమగ్ర ప్రాజెక్ట్‌ ని వేదికను ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం రూపొందించింది. రూ.5లక్షలలోపు వనుల  కింద గ్రామాల్లో ఒక్కో వ్యక్తికి 55లీటర్ల వరకు తాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి నెలా ఖరు వరకు పూర్తి చేయడానికి ప్రణాళికలు తయారు చేశామని చెబుతున్నారు. రూ.5లక్షలకు పైబడిన పను లను కూడా మార్గదర్శకాలు రాగానే చేపడతామని వె ల్లడిస్తున్నారు. అంతిమంగా 2024 నాటికి ప్రతిఇంటికి కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలనే కేంద్రప్రభుత్వ లక్ష్యానికి అ నుగుణంగా పని చేస్తున్నామని అధికారులు చెప్పారు.  పనుల అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేది స్తే దశల వారీగా నిధుల విడుదల కూడా జరుగుతు ందని,  మలిదశలో భాగంగా చేయబోయే పనులను టెండర్ల విధానంలో చేపడతామని తెలిపారు. ఈ మొ త్తం ప్రక్రియలో విలేజ్‌ యాక్షన్‌ కమిటీలు చురుకైన పాత్ర పోషించనున్నాయి.


తొలి విడతలో 440 పనులకు మోక్షం


జిల్లావ్యాప్తంగా రూ.5లక్షలలోపు అంచనాలతో తల పెట్టిన 440 పనులు ఉన్నాయి. ఇందుకు మొత్తం దా దాపు రూ.20కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఈ పనులను మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేసేలా అ ధికారులు లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మిగతా పనులకు కూడా త్వరలోనే అంచనా నివేదికలు రూపొందించి ప్ర భుత్వానికి నివేదిస్తామన్నారు. ఈ పనులకు మరో ఐ దారు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని యం త్రాంగం చెబుతోంది.


ప్రతి ఇంటికి కనెక్షన్‌


గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ఇచ్చే విధంగా కొత్త పైప్‌లైన్‌లు వేయనున్నారు. ఇప్పటికే గ్రా మాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాల కిందనే వీటిని చేపట్టనున్నారు. రాబోయే రోజుల్లో తాగనీటికి పల్లె జ నం ఇబ్బంది పడకుండా సమృద్ధిగా జలాన్ని అందించ డమే జలజీవన్‌ మిషన్‌ ప్రధాన లక్ష్యమని, దానిని సా కారం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తామ ని ఆర్‌డబ్ల్యూఎస్‌ జిల్లా యంత్రాగం చెబుతోంది.


Updated Date - 2020-12-26T05:37:44+05:30 IST