కళ్లముందు నిర్లక్ష్యం కనిపించలేదా..!

ABN , First Publish Date - 2020-12-15T06:27:06+05:30 IST

అధికారుల నిర్లక్ష్యంతో డీప్‌ బోర్ల వద్ద విలువైన మంచి నీరు వృథాగా పోతున్న ఘటన ఎర్రగొండపాలెం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కనిపించింది.

కళ్లముందు నిర్లక్ష్యం కనిపించలేదా..!
మరమ్మతుకు గురైం బోరు

ఎర్రగొండపాలెం, డిసెంబరు 14 : అధికారుల నిర్లక్ష్యంతో డీప్‌ బోర్ల వద్ద విలువైన మంచి నీరు వృథాగా పోతున్న ఘటన ఎర్రగొండపాలెం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కనిపించింది. కార్యాలయ ఆవరణలో పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన బోరు మరమ్మతుకు గురైంది. దాన్ని మరమ్మతులు చేయకపోడంతో బోరు వేసినప్పుడు నీరు లీకవుతోంది. దీంతో కార్యాలయ ఆవరణలో నీరు నిలిచి చిన్నపాటి మాగాణికి తలపిస్తోంది. దీంతో నిత్యం కార్యాలయానికి వచ్చే ప్రజలు బురదతో ఇబ్బందులు పడుతున్నారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరుకు మరమ్మతు చేసి నీటి వృథాను అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా బోరుకు మరమ్మతులు చేస్తామన్నారు.

Read more