కృష్ణానది పడవ ప్రమాద మృతులకు వాకర్స్ క్లబ్ నివాళి
ABN , First Publish Date - 2020-11-13T06:03:51+05:30 IST
రెండేళ్ల కిందట విజయవాడ కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని వాకర్స్ క్లబ్ సభ్యులు పేర్కొ న్నారు.
ఒంగోలు(కల్చరల్), నవంబరు 12: రెండేళ్ల కిందట విజయవాడ కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని వాకర్స్ క్లబ్ సభ్యులు పేర్కొ న్నారు. కార్తీక వనసమారాధనకు వాకర్స్ క్లబ్ సభ్యులు విజయవాడ వెళ్లి అందులో 18 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం సా యంత్రం ఒంగోలులోని రంగారాయుడు చెరువు వాకింగ్ ట్రాక్‌పై క్లబ్ సభ్యులు కొ వ్వొత్తులు వెలిగించి మృతులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సి టిజన్స్ ఫోరం అఽధ్యక్షుడు కొల్లా మధు మాట్లాడుతూ పడవ ప్రమాదానికి కారణ మైన వారిపై ఇంత వరకు చర్యలు చేపట్టకపోవటం విచారకరమన్నారు. కార్యక్ర మంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు పాల్గొన్నారు.