పెద ఆలవలపాడు వీఆర్వో సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-12-01T05:50:38+05:30 IST
పీసీపల్లి మం డలం గుదెవారిపాలెం గ్రామ సచివాలయం ఇన్‌చార్జిగా పనిచేస్తున్న పెద ఆలవలపాడు గ్రామ రెవెన్యూ అధికారి కంచర్ల వెంకట శివ కాశయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పోలా భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఒంగోలు(కలెక్టరేట్), నవంబరు30 : పీసీపల్లి మం డలం గుదెవారిపాలెం గ్రామ సచివాలయం ఇన్‌చార్జిగా పనిచేస్తున్న పెద ఆలవలపాడు గ్రామ రెవెన్యూ అధికారి కంచర్ల వెంకట శివ కాశయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పోలా భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. న వంబరు 25న రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడటంతో ఆయనపై కేసు నమోదు చేసి ఆరెస్టు చేశారు. 48గంటలకుపైగా రిమాండ్‌లో ఉం డటంతో శివ కాశయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.