-
-
Home » Andhra Pradesh » Prakasam » venkateswara temples in sc colonyees
-
దళితవాడల్లోనూ శ్రీవారి దేవాలయాల నిర్మాణం
ABN , First Publish Date - 2020-12-07T05:06:18+05:30 IST
రాష్ట్రంలోని 500 దళితవాడల్లో శ్రీవేంకటే శ్వరస్వామి దేవాలయాలను నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి
మేదరమెట్ల డిసెంబరు 6 : రాష్ట్రంలోని 500 దళితవాడల్లో శ్రీవేంకటే శ్వరస్వామి దేవాలయాలను నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి మేదరమెట్లలో రూ. 1.50 కోట్ల అంచనాతో నిర్మించనున్న టీటీడీ కల్యాణ మండప నిర్మాణాని కి ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అద్దంకి నియో జకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ బాచిన కృష్ణచైతన్య అధ్యక్షతన జరిగిన సభలో వైవీ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలలో టీటీడీ తరుపున 14 క ల్యాణ మండపాలు మాత్రమే నిర్మించారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అ య్యాక సంవత్సరన్నర కాలంలో నాలుగు కల్యాణ మండపాలు నిర్మిస్తు న్నట్లు చెప్పారు. ఈ ఒక్కరోజే రెండు కల్యాణ మండపాలను ప్రారంభి స్తుండగా, మరో రెండు మండపాలకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇకపై నిర్మించే ప్రతి కల్యాణ మండపంలో వేంకటేశ్వరస్వామి దేవాల యం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో గోవులను పూజించడం సాంప్రదాయమని, ఇందుకోసం టీటీడీ ‘గుడికో గోమాత’ కార్యక్రమం చే పట్టిందన్నారు. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమి ళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ఈ ప్రాంతా నికి సంబంధించిన కొరశపాడు ఎత్తిపోతల పథకాన్ని ఆరునెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని చైర్మన్ వైవీ వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు బాచిన చెంచుగరటయ్య, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొ మ్మూరి కనకారావు, టీటీడీ ఎస్‌ఈడీ సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఈ ఈ వేణుగోపాల్, డీఈ నాగభూషణం, ఏఈ లక్ష్మయ్య, ఏఎంసీ వైస్‌చై ర్మన్ ఎర్రం రత్నారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ సాధినేని మస్తానరావు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
శింగరకొండ అభివృద్ధికి కృషి
అద్దంకిటౌన్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శింగరకొండను అన్ని విధాలా అభి వృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి అన్నారు. ఆదివారం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థా నంలో టీటీడీ కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా గోశాల, కేశ కండనశాలకు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే గరటయ్య, దేవస్థానం ఈవో శ్రీని వాసరెడ్డి, శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయ ఇన్‌చార్జి రంగలక్ష్మి, కోటిరెడ్డి, రాము, జ్యోతి హనుమంతరావు, రాధాకృష్ణమూర్తి, శ్రీనివాసకుమార్ తదితరలుఉ పాల్గొన్నారు.