రైతుల ముసుగులో ‘బాబే’ రెచ్చగొడుతున్నారు

ABN , First Publish Date - 2020-03-02T11:08:30+05:30 IST

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధితో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తుంటే ఓర్వలేని మాజీ సీఎం

రైతుల ముసుగులో ‘బాబే’ రెచ్చగొడుతున్నారు

దేవదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి  


కనిగిరి, మార్చి 1:  అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధితో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తుంటే ఓర్వలేని మాజీ సీఎం చంద్రబాబు రైతుల ముసుగులో రెచ్చగొడుతున్నారని రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఆదివారం స్థానిక పవిత్ర కన్వెన్షన్‌ హాలులో రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ నాయకులు, ఆర్యవైశ్య సత్ర సముదాయాల జాతీయ చైౖర్మన్‌ దేవకి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి ముఖ్య అతిఽఽథిగా పాల్గొన్నారు. చంద్రబాబు అమరావతి అభివృద్ధి అంటున్నారే కానీ విజయవాడ, గుం టూరు గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏ మాత్రం అభివృద్ధి చెందాయో చెప్పాలన్నారు.


ఆర్యవైశ్య నాయకుడు దేవకి వెంకటేశ్వర్లుకు కనిగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన గుర్తింపు ఉందని, ఆయన వైసీపీలో చేరికతో పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ మాట్లాడుతూ దేవకి వెంకటేశ్వర్లు కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉందని, వారు పార్టీలోకి రావడంవల్ల పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబు మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు రాష్ర్టాన్ని నాశనం చేయడమే గాక ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైౖర్మన్‌కుప్పం ప్రసాద్‌, పోతుల సురేష్‌, వైసీపీ రాష్ట్ర నాయకుడు మువ్వా చంద్రశేఖర్‌, స్థానిక వైసీపీ నాయకులు  పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T11:08:30+05:30 IST