వాహనం ఢీకొని రిక్షా కార్మికుడు మృతి

ABN , First Publish Date - 2020-12-31T04:14:37+05:30 IST

వాహనం తగలటంతో రిక్షా కార్మికుడు రోడ్డుపై పడి తలకు తీవ్రగాయమై మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం మార్టూరులో ఎఫర్ట్‌ కార్యాలయం సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో జనార్ధన కాలనీకి చెందిన పోట్లూరి దాసు(65) మృతిచెందాడు.

వాహనం ఢీకొని రిక్షా కార్మికుడు మృతిమార్టూరు, డిసెంబరు 30 : వాహనం తగలటంతో రిక్షా కార్మికుడు రోడ్డుపై పడి తలకు తీవ్రగాయమై మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం మార్టూరులో ఎఫర్ట్‌ కార్యాలయం సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో జనార్ధన కాలనీకి చెందిన పోట్లూరి దాసు(65) మృతిచెందాడు. ఏఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... దాసు రిక్షాను నడుపుకుంటూ ఎఫర్ట్‌ కార్యాలయం ముందు సర్వీసురోడ్డు గుండా మార్టూరులోని నాగరాజుపల్లి సెంటరుకు వస్తున్నాడు. అదే సమయంలో మార్టూరు నుంచి అమరావతి నూలుమిల్లు వైపు వెళుతున్న ఓ వాహనం రిక్షాను ఢీకొన్నది. దాంతో రిక్షా పడిపోగా దాసు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య హైమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

Updated Date - 2020-12-31T04:14:37+05:30 IST