ఆరుగాలం కష్టం వర్షార్పణం
ABN , First Publish Date - 2020-12-01T06:11:09+05:30 IST
నివ ర్ తుఫాన్ రైతులను కోలుకోలేని దె బ్బతీసింది. ఆరుగాలం కష్టపడి పం డించిన పంటను నీటిపాల్జేసింది. దీం తో రైతులు కన్నీరుపెడుతున్నారు.

నీటిలోనే మిర్చి, పత్తి, మినుము
పలుచోట్ల కుళ్లిన మిరప కాయలు
అంచనాలు దాటుతున్న నష్టం
మార్కాపురం, నవంబరు 30 : నివ ర్ తుఫాన్ రైతులను కోలుకోలేని దె బ్బతీసింది. ఆరుగాలం కష్టపడి పం డించిన పంటను నీటిపాల్జేసింది. దీం తో రైతులు కన్నీరుపెడుతున్నారు. రెండు రోజుల క్రితం వర్షం తెరిపి చ్చినా అనేక చోట్ల ఇంకా పంటలు నీటి లోనే ఉన్నాయి. దీన్ని బయటకు పంపే మార్గం కన్పించక రైతులు దిక్కుతోచని పరి స్థితిని ఎదుర్కొంటున్నారు. ఆ పంటలు ఉర కెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. పలుగ్రామాల్లో కోసి కళ్లాల్లో ఉన్న మిరపకాయలు తడిసి కుళ్లిపోతున్నాయి. మండలంలోని చింతగుంట్ల, తిప్పాయపాలెం, మిట్టమీదపల్లె తదితర గ్రామాల్లో పత్తి, మినుము, మిరప ఎక్కువగా సాగు చేశారు. ఈ పంటలకు సంబంధించిన నష్టం అంచనాలు దాటుతోంది.