-
-
Home » Andhra Pradesh » Prakasam » unity is nessesary
-
ఐక్యతగా ముందుకు సాగాలి
ABN , First Publish Date - 2020-12-28T06:33:13+05:30 IST
సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం పశ్చిమ కార్యదర్శి తోటా తిరుపతిరావు అన్నారు.

గిద్దలూరు టౌన్, డిసెంబరు 27 : సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం పశ్చిమ కార్యదర్శి తోటా తిరుపతిరావు అన్నారు. పట్టణంలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం క్యాలెండర్లను దేవస్థాన కమిటీ అధ్యక్షులు మేకల బయ్యన్నయాదవ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సంఘం కార్యదర్శి తోటా తిరుపతిరావు మాట్లాడుతూ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంటున్న పెంపకందారులను అటవీశాఖ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం సంఘంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు మేకల బయ్యన్నయాదవ్, యాదవ సంఘం నాయకులు డాక్టర్ వేణుగోపాల్, ఓ.వెంకటయ్య, తదితరులు ఉన్నారు.