రైతుల పక్షాన సంఘటితంగా ఉద్యమిద్దాం

ABN , First Publish Date - 2020-12-27T06:39:53+05:30 IST

పకృతి వైపరీత్యాల కారణంగా రైతులు అప్పులపాలై నియోజకవర్గంలో ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర అన్నారు.

రైతుల పక్షాన సంఘటితంగా ఉద్యమిద్దాం
మాట్లాడుతున్న మన్నె రవీంద్ర

జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు రవీంద్ర

 ఎర్రగొండపాలెం, డిసెంబరు 26 : పకృతి వైపరీత్యాల కారణంగా రైతులు అప్పులపాలై నియోజకవర్గంలో ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో రైతుసమస్యలపై టీడీపీ ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష నేతలతో రైతు సమస్యలపై సమావేశం నిర్వహించారు.  టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టరు రవీంద్ర మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని వీటిని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అన్నారు. గత ఐదు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సీడీ రూపంలో వ్యవసాయ యంత్రపరికరాలకు , మైక్రో ఇరిగేషన్‌కు సబ్సీడీ ఇచ్చి చిన్న సన్నకారు రైతులకు చేయూత నిచ్చిందని అన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో అఖిల పక్ష పార్టీలతో కలిసి రైతుల కోసం పోరాటం చేయాలని అన్నారు.  సమావేశంలో కాంగ్రెస్‌ ఇన్‌చార్జీ మెడబలిమి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలు రైతులకు ఉరితాళ్లుగా మారాయని అన్నారు. సీపీఐ సీపీఎం నాయకులు టీసీహెచ్‌ చెన్నయ్య  మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు టన్నల్‌ పనులు తప్ప మేజరు కాలువలు నిర్మాణాలు జరగడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం మరో సంవత్సరం పాటు పట్టినా, ఆశ్చర్య పడాల్సిన పనిలేదన్నారు.  సమావేశంలో సీపీఐ నాయకులు కేవీవీ కృష్ణగౌడ్‌, బీఎస్పీ ఇన్‌చార్జీ ఆర్‌.ప్రసాద్‌, టీడీపీ మాజీ అధ్యక్షుడు శనగా నారాయణరెడ్డి, మాజీ జడ్పీటీసీ మంత్రు నాయక్‌,  రైతు సంఘం నాయకుడు సీహెచ్‌ వెంగళరెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు గోళ్ల సుబ్బారావు, మాజీ సర్పంచి చేవుల అంజయ్య, బ్రహ్మరెడ్డి, టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ,  బీయస్పీ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T06:39:53+05:30 IST