ఒక్క లోనూ రాదాయే..!
ABN , First Publish Date - 2020-07-19T11:26:13+05:30 IST
ఎస్సీ కార్పొరేషన్ నేడు వట్టిపోయింది. రెండే ళ్లకిత్రం వరకు ఎందరో ఎస్సీ నిరుద్యోగులకు, ఔత్సాహికులకు ఆధారమై ఉపాధి

వట్టిపోయిన ఎస్సీ కార్పొరేషన్
ఆవేదనలో నిరుద్యోగులు
ఒంగోలు(ప్రగతిభవన్): ఎస్సీ కార్పొరేషన్ నేడు వట్టిపోయింది. రెండే ళ్లకిత్రం వరకు ఎందరో ఎస్సీ నిరుద్యోగులకు, ఔత్సాహికులకు ఆధారమై ఉపాధి కల్పించిన కా ర్పొరేషన్ ప్రస్తుతం నిధులు, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు లేక మోడువారిన చెట్టులా మారింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎ స్సీ కార్పొరేషన్ నిత్యం దళిత ప్రజలకు ఆసరాగా నిలిచింది. బ్యాంకు లింకేజి ద్వారా రుణాలు, మైనర్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయ బోర్లు, దళి తులకు భూమి కొనుగోలు పథకం, స్కావెంజర్లు కు ఉపాధి, భూమి అభివృద్ధి, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీల కింద వాహనాల కొనుగోలు వంటి పథకాలు వ ల్ల జిల్లాలో వేలమంది లబ్ధి పొందారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
గత రెం డేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులను కనీసం కే టాయించలేదు. అంతేగాకుండా ఇంటర్ కాస్ట్ మారేజీ స్కీం ఎత్తివేశారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులును పక్కదారి పట్టించి వేరే పథకాలకు వినియోగిస్తున్నారు. అంతేగాక గత రెండు సంవ త్సరాలుగా రెగ్యులర్ ఈడీని ప్రభుత్వం నియ మించలేదు. ఇన్‌చార్జిలతోనే కాలం గడుపుతోంది. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ కింద 2018-19 సంవత్సరానికి రుణాల కోసం ఇంటర్య్వూలు పూర్తి అయినా నే టికీ వాటికి సంబంధించిన యూనిట్లు లబ్ధిదా రులకు అందలేదు.
వాటికి సంబంఽధించిన లబ్ధి దారులు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉ న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యా యం చేయాలని దళిత సంఘాల నాయకులు డి మాండ్ చేస్తున్నారు.