అనర్హులను గుర్తించేందుకు 28న తల్లిదండ్రుల సమావేశం

ABN , First Publish Date - 2020-12-26T05:45:31+05:30 IST

అమ్మఒడి పథకం లబ్ధిదారుల జా బితాలో అనర్హులు ఉంటే వారిని గుర్తించి తొలగించేందుకు ఈనెల 28న అ న్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీతో సమావేశం నిర్వహించాలని డీఈవో వీఎస్‌.సుబ్బారావు శుక్రవారం తెలిపారు.

అనర్హులను గుర్తించేందుకు 28న తల్లిదండ్రుల సమావేశం

డీఈవో  సుబ్బారావు


 ఒంగోలువిద్య, డిసెంబరు 25 : అమ్మఒడి పథకం లబ్ధిదారుల జా బితాలో అనర్హులు ఉంటే వారిని గుర్తించి తొలగించేందుకు ఈనెల 28న అ న్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీతో సమావేశం నిర్వహించాలని డీఈవో వీఎస్‌.సుబ్బారావు శుక్రవారం తెలిపారు. ఈ సమావేశంలో అర్హులైన వారి జాబితాకు ఆమోద ముద్ర వేయాలన్నారు. ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేల కంటే ఎక్కువ వేతనం ఉంటే వారిని అనర్హుల జాబితాలో చేర్చాలని చెప్పా రు. 30న గ్రామసభ అనుమతి తరువాత ధ్రువీకరణ జాబితాను ప్రధానోపా ధ్యాయులు ఈనెల 31న ఎంఈవోలకు అందజేయాలని డీఈవో కోరారు. 

Updated Date - 2020-12-26T05:45:31+05:30 IST