స్వప్రయోజనాల కోసమే జగన్‌ను కలిసిన సినీ హీరోలు

ABN , First Publish Date - 2020-06-11T10:14:43+05:30 IST

స్వార్థ ప్రయోజనాల కో సమే కొంత మంది సినీ హీరోలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారని ని యోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి..

స్వప్రయోజనాల కోసమే జగన్‌ను కలిసిన సినీ హీరోలు

హుద్‌హుద్‌, అమరావతి రైతులు, కరోనా సమస్యలు కనిపించలేదా?

చంద్రబాబు వల్ల పదవులు పొంది పార్టీ మారి విమర్శించడం తగదు

విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి


కనిగిరి టౌన్‌, జూన్‌ 10 : స్వార్థ ప్రయోజనాల కో సమే కొంత మంది సినీ హీరోలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారని ని యోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో సినీహీరో, హిం దూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 60వ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ను కట్‌ చేసిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలో, అమరావతి రాజధాని రైతుల విషయం లో, కరోనా లాక్‌డౌన్‌లో కనిపించని సినిమా హీరోలు వారి ఆర్థిక స్వలాభం కోసమే సీఎంను కలవడం బాధాకరమన్నారు.


టీడీపీని వీడిన నాయకులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మెప్పు పొందేందుకు లోకేష్‌, చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలుతుండడం దుర్మార్గమన్నారు. టీడీపీలో ఎన్నో ఉన్నత పదవులకు చేర్చిన చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడిన మాటలను డాక్టర్‌ ఉగ్ర తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బేరి పుల్లారెడ్డి, చిరంజీవి, గాయం తిరుపతిరెడ్డి, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, బ్రహ్మంగౌడ్‌, షేక్‌ బుజ్జా, వివిధ మండలాల పార్టీ నాయకులు, బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-11T10:14:43+05:30 IST