ఇద్దరు దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2020-03-04T10:50:42+05:30 IST

గృహ చోరీలతోపాటు, మోటారు సైకిళ్ల దొంగత నాలు చేసే ముఠాలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద ఆరు

ఇద్దరు దొంగల అరెస్టు

ఆరు మోటారు సైకిళ్లు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం 

పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు 

 వివరాలను వెల్లడించిన ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ 


ఒంగోలు (క్రైం), మార్చి 3 : గృహ చోరీలతోపాటు, మోటారు సైకిళ్ల దొంగత నాలు చేసే ముఠాలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద ఆరు మోటారు సైకిళ్లు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఒంగోలు డీఎస్పీ ప్రసా ద్‌ మంగళవారం వెల్లడించారు.  ఆయన కథనం మేరకు.. ఒంగోలులోని జయప్రకాష్‌ కాలనీకి చెందిన మోటా నవీన్‌ గజదొంగ. అతను ఓ కేసులో అరెస్టు అయి గుంటూరు జిల్లా జైలులో కొంత కాలం శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో అతనికి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణ్‌పేటకు చెందిన కొండోల సాయికుమా ర్‌తో పరిచయం అయింది.


అదేవిధంగా నవీన్‌ మరో కేసులో ఒంగోలు జైలులో ఉన్న సమయంలో మరో దొంగ అయిన మర్రిపూడి మండలానికి చెంది ఒంగోలులోని గోపా ల్‌నగర్‌లో ఉంటున్న జూటూరు ప్రశాంత్‌తో స్నేహం ఏర్పడింది. గతనెల 4వతేదీన నవీన్‌ జైలు నుంచి విడుదలకాగా, 11వ తేదీన సాయికుమార్‌ కూడా బయటకు వచ్చాడు. వీరిద్దరూ అంతకుముందే విడుదలైన ప్రశాంత్‌తో కలిసి ముఠగా ఏర్పడ్డారు.  చోరీలు చేయడం ప్రారంభించారు. ఒంగోలు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో వీరిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు, చిత్తూరు జిల్లా తిరుప తిల్లోనూ పలు దొంగతనాలకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం నగరంలోని ఇందుర్తినగర్‌ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న సాయికుమార్‌, ప్రశాంత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ చెప్పారు. విచారించగా నేరాలను అంగీ కరించారని తెలిపారు. వారి వద్ద రూ. 3.99లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసు కున్నామన్నారు. అందులో ఆరు మోటారు సైకిళ్లు, ఏడు సెల్‌ఫోన్లు ఉన్నాయని వివ రించారు.


ఈ ముఠాకు సూత్రధారి అయిన మోటా నవీన్‌ పరారీలో ఉన్నారన్నారు. అతని వద్ద కొంత బంగారం మరికొన్ని సెల్‌ఫోన్లు ఉన్నట్లు పట్టుబడిన దొంగలు తెలిపారని చెప్పారు. అతని కోసం గాలిస్తున్నామన్నారు. అరెస్టయిన సాయికుమార్‌ 15 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రాలో పలు నేరాలకు పాల్పడ్డారని చెప్పారు.  దొంగలను పట్టుకున్న ఒంగోలు టూటౌన్‌  సీఐ రాజేష్‌, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

Updated Date - 2020-03-04T10:50:42+05:30 IST