-
-
Home » Andhra Pradesh » Prakasam » tulluru darsi rytulu
-
తుళ్లూరులో దర్శి రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2020-12-07T05:15:19+05:30 IST
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాల ని రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దర్శి నియోజకవర్గ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు, మహిళా రైతులు ఆదివారం తుళ్లూరు తరలి వెళ్లారు.

దర్శి, డిసెంబరు 6 : అమరావతిలోనే రాజధానిని కొనసాగించాల ని రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దర్శి నియోజకవర్గ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు, మహిళా రైతులు ఆదివారం తుళ్లూరు తరలి వెళ్లారు. అక్కడి రైతులు ఆందోళన చేపట్టి 355 రోజులైన సందర్భంగా వారికి సంఘీభావం తెలిపి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతిని మార్చాలని ప్రయత్నించడం తుగ్లక్ చర్యని విమర్శించారు. కార్యక్రమంలో రైతు నాయకులు కడియాల పుల్లయ్య, కిలారి తిరపతయ్య, పోకూరి వెంకటేశ్వర్లు, మహిళారైతులు రావిపాటి గోవిందమ్మ, ఏనుగంటి కుమారి, మాగం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.