-
-
Home » Andhra Pradesh » Prakasam » Tuberculosis should be identified
-
క్షయ వ్యాధిగ్రస్థులను గుర్తించాలి
ABN , First Publish Date - 2020-03-25T10:17:53+05:30 IST
క్షయ వ్యాధిగ్రస్థులను గుర్తించాలని స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సృజన అన్నారు.

పీసీపల్లి, మార్చి 24 : క్షయ వ్యాధిగ్రస్థులను గుర్తించాలని స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సృజన అన్నారు. మంగళవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక పీహెచ్‌సీలో వైద్యసిబ్బందికి వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వారాలకు మించి దుగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం వచ్చే వారిని గుర్తించి వైద్యశాలకు పంపించాలన్నారు. కెళ్లను సేకరించి పరీక్షించడం ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చన్నారు.
రోగులకు ప్రభుత్వం ఉచితంగా మందులు, పౌష్టికాహారం పంపిణీ చేస్తుందన్నార 6 నెలలు క్రమం తప్పకుండా వైద్యశాలలో ఫీడింగ్ తీసుకోవడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. వ్యాధిగ్రస్థులు ఇళ్లలో సామాజిక దూరం పాటించడంతో పాటు దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముఖానికి రుమాలు పెట్టుకోవాలన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి గృహ సందర్శన చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీహెచ్‌వో సుజాత, హెచ్‌ఈవో బేగ్, పీహెచ్‌ఎన్ సుశీల, ఎస్‌టీఎస్ బాబురావు పాల్గొన్నారు.