పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి పెద్దపీట

ABN , First Publish Date - 2020-12-07T05:05:30+05:30 IST

వెనుకబడిన పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి పెద్దపీట
మార్కాపురంలో కల్యాణ మండప శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి,

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

మార్కాపురం, డిసెంబరు 6: వెనుకబడిన పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించి కల్యాణ మండపాన్ని ఆ దివారం ఆయన ప్రారంభించారు. మార్కాపురం ఎ మ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్ట్‌ మొదటి దశ నిర్మాణ పనులు త్వరలో, రెండ వ దశ పనులు నాలుగైదు నెలల్లో  పూర్తవుతాయన్నా రు. ఫ్లోరిన్‌ బాధితులను ఆదుకునేందుకు జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి నియోజకవర్గాలలో వాటర్‌ గ్రిడ్‌ను మొదటి దశలో ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మార్కాపురం ప్రాంతంలో పేదల వైద్య అవసరాల నిమిత్తం వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.350 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మార్కాపురంలో టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ  మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి తలపెట్టిన టీటీడీ కల్యాణ మండప నిర్మా ణ కార్యక్రమాన్ని  ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి పూర్తి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కుందురు పెద్ద కొండారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వెన్నా హనుమారెడ్డి, సంయుక్త కార్యదర్శి మీర్జా షంషీర్‌ అలీబేగ్‌, మాజీ జడ్పీటీసీ కుందురు కృష్ణమోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గుంటక కృష్ణవేణి సుబ్బారెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జక్కా లక్ష్మీ ప్రకాశరావు, మాజీ కౌన్సిలర్లు షేక్‌ ఇస్మాయిల్‌, బుశెట్టి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రాభివృద్ధికి కృషి

 ఎర్రగొండపాలెం, డిసెంబరు 6:  రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం ఎర్రగొండపాలెంలో టీటీడీ కల్యాణ మండపం, రైతు బజార్‌,  వ్యవసాయ మార్కెట్‌ భవన నిర్మాణ పనులకు మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా వైవీ మాట్లాడుతూ ఎర్రగొండపాలెంలో టీటీడీ కల్యాణ మండపం అవసరమని మంత్రి సురేష్‌ కోరిన వెంటనే రూ. 1.30కోటి నిధులు మంజూరు చేసి శంకుస్థాపనకు వ చ్చానని చెప్పారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మా ట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అభి వృద్ధిలో ప్రథమస్థానంలో ఉంచుతానని చెప్పారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డిని మంత్రి ఆదిమూలపు సురేష్‌, జార్జి విద్యాసంస్థల కరస్పాం డెంట్‌ ఆదిమూలపు సతీష్‌ సన్మానించారు. కార్య క్రమంలో ఏఎంసీ చైర్మన్‌ ఒంగోలు మూర్తి రెడ్డి,  మ ద్దిపాడు మార్కెట్టు కమిటీ మాజీ చైర్మన్‌ మారం వెంకారెడ్డి,  వైసీపీ మండల కన్వీనర్‌ డి.కిరణ్‌గౌడ్‌, టీ టీడీ ఎస్‌ఈ ఎ.వెంకటేశ్వర్లు, ఐదు మండలాల వైసీ పీ కన్వీనర్లు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైసీపీ నా యకులు పాల్గొన్నారు. 


పోస్టర్‌ ఆవిష్కరణ 

ఎర్రగొండపాలెంలోని గ్రంథాలయంలో ఆదివారం చదవడం మాకిష్టం పోస్టర్‌ను మంత్రి ఆదిమూలపు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈవో సుబ్బారావు, ఏఎంవో రాజశేఖరరెడ్డి, ఎంఈవో ఆంజనేయులు, గ్రం థపాలకురాలు ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-07T05:05:30+05:30 IST